పార్లమెంటులో గందరగోళం... ఉభయసభలు వాయిదా

పార్లమెంటు ఉభయసభలు రేపటికి వాయిదాపడ్డాయి. రెండు విడుతల బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభంకాగానే అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వ వైఖరికీ వ్యతిరేక ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. దాంతో పార్లమెంటు ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల్లో విపక్షాలను బుజ్జగించిసభలు సజావుగా సాగేలా చూడాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించింది. లండన్‌లో చేసిన వ్యాఖ్యలకు గానీ రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ ఎదురదాడికి దిగింది. కేంద్ర మంత్రులు, ఎంపీలు రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ ఆందోళనకు దిగారు. ఈ పరిణామాలు మధ్య పార్లమెంటు ఉభయసభలు ముందుగా మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదాపడ్డాయి. ఆ తర్వాత సభలు ప్రారంభమైనప్పటికీ మళ్లీ అదే పరిస్థితి రిపీట్ అయ్యింది. దాంతో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ సభలను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు.