కోర్టు తీర్పులకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు : బొత్స

కోర్టు తీర్పులకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు : బొత్స

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతి మహిళ ఇంటి యజమానిగా ఉండాలనే ఇళ్ల పథకం తీసుకొచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో నిర్వహించిన వైఎస్‌ఆర్‌ ఆసరా చెక్కుల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బొత్స మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు తీర్పు చాలా బాధ కలిగించిందని అన్నారు. దీనిపై ఉన్నత న్యాయస్థానాని ఆశ్రయిస్తామని తెలిపారు. కోర్టు తీర్పులకు ప్రభుత్వం వ్యతిరేకం కాదన్నారు. కేంద్ర విధివిధానాలతో ఇళ్ల పథకం చేపట్టామని తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నామన్నారు. ఇళ్ల పథకాన్ని అడ్డుకుంటే ప్రజలకు దిక్కెవరు? రాజ్యాంగబద్ధంగానే సంక్షేమ  కార్యక్రమాలు చేస్తున్నాం అని అన్నారు. 

 

Tags :