ప్రజల అభిప్రాయాలు తీసుకుని.. మళ్లీ ముందుకు

ప్రజల అభిప్రాయాలు తీసుకుని.. మళ్లీ ముందుకు

రాజధాని నిర్ణయంపై తాము వెనక్కి తగ్గలేదని, ఆగిపోలేదని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఇంకా పకడ్బందీగా తమ నిర్ణయాలు ఉంటాయని ప్రకటించారు. శాసనసభలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎం జగన్‌ పూర్తి స్టేట్మెంట్‌ ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత ప్రజల మనోభావాలు ఏంటి అనేది కూడా సీఎం చెప్పారని పేర్కొన్నారు. ఎక్కడో ఒక దగ్గర అపోహలు ఉన్నాయని, టీడీపీ దుష్ప్రచారాలు చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల అందరి అభిప్రాయాలు తీసుకుని మళ్లీ ముందుకు వస్తామని తెలిపారు. రైతులకు ఇంకా సమస్య ఎక్కడ ఉందని, వాళ్ల మనుసుకు తగ్గట్టు తాము అన్ని చేయలేమన్నారు.

మాజీ సీఎం చంద్రబాబు పర్యటనకు వస్తుంటే ఏముంది ఇక్కడ స్మశానం తప్ప అన్నానని, ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఒకచోట నుంచే పాలించాలని రాజ్యంగంలో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీకి రాష్ట్రంలో స్థానంలో లేదని, రోజుకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఎలా వచ్చిరని ప్రశ్నించారు.

 

Tags :