పేదవారి సహాయార్థం భారీ విరాళం.. పెద్ద మనసు చాటుకున్న బ్రాహ్మిన్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్

పేదవారి సహాయార్థం భారీ విరాళం.. పెద్ద మనసు చాటుకున్న బ్రాహ్మిన్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్

అగ్రరాజ్యం అమెరికాలోని బ్రాహ్మిన్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్ (బీఎస్‌ఎన్‌వై) మరోసారి పెద్ద మనసు చాటుకుంది. ఈ స్వచ్ఛంద సంస్థ సేవ చేయాలనే గొప్ప ఉద్దేశ్యంతో నవంబరు 11న ‘గాలా దివాలీ డిన్నర్ ఫర్ కాజ్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. మేయర్ ఎరిక్ ఆడమ్స్ వద్ద అంతర్జాతీయ వ్యవహారాల శాఖలో వాణిజ్యం, పెట్టుబడుల శాఖ డిప్యూటీ కమిషనర్ దిలీప్ చౌహాన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన సుదీర్ఘకాలంగా బీఎస్‌ఎన్‌వైలో సభ్యులు కూడా కావడం గమనార్హం. అవసరంలో ఉన్న వారిని ఆదుకోవాలనే సంకల్పంతో పని చేసే బీఎస్‌ఎన్‌వై.. ఎన్నోసార్లు తమ పెద్ద మనసు చాటుకుంది. ఈ క్రమంలోనే ఈసారి ‘ది ఇన్’ అనే సంస్థకు భారీగా విరాళం ఇస్తున్నట్లు బీఎస్‌ఎన్‌వై ప్రెసిడెంట్ రూతా దావే వెల్లడించారు. ఆకలితో బాధ పడేవారు, ఇళ్లు లేని వారు, పేదరికంలో కొట్టుమిట్టాడే వారికి ‘ది ఇన్’ సంస్థ అండగా ఉండి, వారికి అవసరమైన సహాయం చేస్తుంది. ఈ సంస్థకు విరాళం ఇస్తున్నట్లు దివాలీ విందులో రూతా ప్రకటించారు. ఈ విందుకు ముందు రంగోలీ పోటీలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తమకు మద్దతుగా నిలిచిన వారందరినీ సంస్థ గౌరవించింది. యవతకు సంస్కృతి, సంప్రదాయాలు సంస్థ సభ్యులు వివరించారు.

 

Tags :