ప్రధాని రేసులో పుంజుకున్న రిషి సునాక్

ప్రధాని రేసులో పుంజుకున్న రిషి సునాక్

బ్రిటన్‌ ప్రధాని పదవికి పోటీ పడుతున్న భారత సంతతి నేత, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ పుంజుకున్నారు. కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులకు నిర్వహించిన పోల్‌లో తన ప్రత్యర్థి, విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌తో ఉన్న అంతరాన్ని గణనీయంగా తగ్గించుకోగలిగారు. ప్రస్తుతం ఇద్దరు నేతల మద్య కేవలం 5 శాతం మాత్రమే తేడా ఉంది. ఇటలీకి చెందిన ప్రజా వ్యవహారాల కంపెనీ టెక్నీ..  గతవారం 807 మంది కన్జర్వేటివ్‌ సభ్యులను సర్వే చేసింది. అందులో రిషి సునాక్‌కు 43 శాతం, లిజ్‌ ట్రస్‌కు 48 శాతం మంది మద్దతు పలికారు. 9 శాతం మంది మాత్రం ఏ విషయాన్ని వెల్లడిరచలేదు. మరోవైపు గతవారం బ్రిటిస్‌ అంతర్జాతీయ మార్కెట్‌ పరిశోధన సంస్థ యూగవ్‌ నిర్వహించిన సర్వేలో లిజ్‌ ట్రస్‌కు 62 శాతం మంది నుంచి మద్దతు లభించిగా, రిషికి 38 శాతం మంది మద్దతిచ్చారు. ఇద్దరి మధ్య వ్యత్యాసం 24 శాతం కనిపించింది. ఇప్పుడు అది అయిదుకు తగ్గడం సునాక్‌కు ఊరటనిచ్చే అంశమే.

 

Tags :