ఆలా చేయకుండా ఉండాల్సింది...

ఆలా చేయకుండా ఉండాల్సింది...

పంజాబ్‌ పర్యటనలో భద్రతా లోపం కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనని రద్దు చేసుకున్న ఘటనపై  యూకే కేంద్రంగా పని చేస్తోన్న బ్రిటీష్‌ సిక్కు సంఘం విచారం వ్యక్తం చేసింది.  ప్రధాని మోడీ పర్యటనకు అంతరాయం కలిగించిన గ్రూపులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు బ్రిటీష్‌ సిక్కు సంఘం ఓ ప్రకటనని రిలీజ్‌ చేసింది. మోడీ పర్యటనకు అంతరాయం కలిగించిన కొందరు దారి తప్పిన వ్యక్తులు.. పంజాబ్‌కు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చేందుకు ప్రధాని వచ్చారన్న సంగతిని గుర్తించాలని బ్రిటీష్‌ సిక్కు సంఘం ఛైర్మన్‌ లార్డ్‌ రామి డేంజర్‌ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పంజాబ్‌లో రూ.42,750 కోట్ల విలువైన అభివృద్ధి ప్రకటను ప్రధాని చేయాల్సి వుందని డేంజర్‌ అన్నారు. 

 

Tags :