MKOne TeluguTimes-Youtube-Channel

ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత దీక్ష

ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత దీక్ష

మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో చేపట్టిన నిరాహార దీక్ష విజయవంతం అయింది. ఎమ్మెల్సీ కవితకు ఎంపీ కే కేశవరావు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఇది ఒక్క రాష్ట్రానికి సంబందించిన సమస్య కాదని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం మా పోరాటం కొనసాగుతోంది. మహిళా రిజర్వేషన్‌ సాధించే వరకు విశ్రమించేది లేదు. మోదీ ప్రభుత్వం తలచుకుంటే ఈ బిల్లు పాసవుతుంది. డిసెంబర్‌లో పార్లమెంట్‌ సమావేశాలు ముగిసే వరకు పోరాడుతూనే ఉంటాము. రాష్ట్రపతికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ప్రారంభించిన ఈ పోరాటం ఇంకా ఉధృతమవుతుంది. మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరం సాధించి తీరాలి అని కవిత స్పష్టం చేశారు. 

 

 

Tags :