కవిత కళ్ల ముందే బీఆర్ఎస్ నేతల బాహా బాహీ

కవిత కళ్ల ముందే బీఆర్ఎస్ నేతల బాహా బాహీ

బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట జరిగింది. ఆ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కవిత కళ్లెదుటే కార్యకర్తలు కొట్టుకున్నారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లిలో వెలుగు చూసింది. కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన సమయంలో ఈ గొడవ జరగడం గమనార్హం. స్థానికంగా కార్మిక సంఘం భవన ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి కవిత, సత్యవతి రాథోడ్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో స్థానిక నేతలు మధుసూదనాచారి, గండ్ర వెంకటరమణరెడ్డి వర్గాలు బలప్రదర్శనకు దిగాయి. భవనం శిలాఫలకంపై మధుసూదనాచారి పేరు లేదని ఆయన అనుచరులు గొడవకు దిగారు. అప్పుడే అక్కడకు చేరుకున్న గండ్ర అనుచరులు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేయడం మొదలు పెట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, ఇతర నేతలు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు.

 

 

Tags :