అధికారంలో రాగానే అలాంటి వారిని.. ఇంటి నుంచి

అధికారంలో రాగానే అలాంటి వారిని.. ఇంటి నుంచి

జగన్‌ జైల్లో ఉంటే తల్లి, చెల్లి రోడ్ల మీదకు వచ్చి పాదయాత్ర చేశారని, అలాంటి వారిని అధికారంలోకి రాగానే ఇంటి నుంచి గెంటేయలేదా? అని తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వెన్నుపోటుకు, గొడ్డలిపోటుకు పేటెంట్‌ జగన్‌ అని విమర్శించారు. కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకో, సొంత బాబాయ్‌ని గొడ్డలితో నరికించిన చరిత్ర ఎవరిది?  అని ప్రశ్నించారు. వెన్నుపోటు దారుడు ఎవరో కొంచెం మైండ్‌ పెట్టి ఆలోచించి. దమ్ముంటే చర్చకు రా.. వెన్నుపోటు, గొడ్డలి  పోటు ఎవరిదో తేలుద్దాం అన్నారు. కొడాలి నానిని నాడు టీడీపీ నుంచి బయటకు గెంటేశాం. ఎన్టీఆర్‌ను తిట్టిన వైఎస్‌ నీకు దేవుడా? నిన్ను ఎమ్మెల్యేని చేసిన చంద్రబాబు వెన్నుపోటు దారుడా? అని ప్రశ్నించారు.  తల్లి, చెల్లిని పార్టీ నుంచి గెంటేసిన జగన్‌ వెన్నుపోటుదారుడు కాదా? గుడివాడ మహానాడుతో కొడాలి నాని పని అయిపోతుంది. నానికి కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయింది, గడివాడ ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని అన్నారు.

 

Tags :