31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో షిప్టుల వారీగా సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి రోజు పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగించనున్నారు. అనంతరం ఆర్థిక సర్వే జరగనుంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. జవనరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయి. రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 8 వరకు జరగనున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ వర్గాలు వెల్లడిరచాయి.

దాదాపు 400 మంది పార్లమెంట్‌ సిబ్బందికి కరోనా సోకిన విషయం  తెలిసిస్త్రందే.  దీంతో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు అలర్ట్‌ అయ్యారు. పరిస్థితిని సమీక్షించారు. అయితే కరోనా రూల్స్‌ను కచ్చితంగా పాటిస్తూ, పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహించాలని డిసైడ్‌ అయ్యారు. పార్లమెంట్‌ సభ్యులందరూ భౌతిక దూరం పాటిస్తూ కూర్చునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన ఎంపీల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని, వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లో పరీక్షల నిర్వహణ, టీకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సమావేశాలు సాఫీగా సాగేలా పార్లమెంటు అన్ని ఏర్పాట్లు చేస్తోందని వెల్లడిరచారు.

 

Tags :