కాలిఫోర్నియాలో వరద బీభత్సం... ఇప్పటి వరకు 19 మంది

కాలిఫోర్నియాలో వరద బీభత్సం... ఇప్పటి వరకు 19 మంది

అమెరికాలోని కాలిఫోర్నియా వాసులు వరుస తుపానులతో బిక్కుబిక్కుమంటున్నారు. భారీ వరదలు, మంచు కారణంగా రాష్ట్రంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో రెండు రోజులు వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాలిఫోర్నియా వరదలను విపత్తుగా అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించారు.  సియెర్రా నెవడా ప్రాంతంలో మూడడుగుల మేర మంచు కురిసింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వారం రోజులుగా ఏడడుగుల మేర మంచు పడిందని తెలిపింది. వరదల కారణంగా ప్రధాన రహదారులు, శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి.

 

 

Tags :