దిగ్విజయంగా సాగిన కెనడా- అమెరికా తెలుగు సదస్సు 

దిగ్విజయంగా సాగిన కెనడా- అమెరికా తెలుగు సదస్సు 

* ద్విగ్విజయం గా సాగిన కెనడా- అమెరికా తెలుగు సదస్సు లో   50 % కెనడియన్ రచయితలు, 50% అమెరికా రచయితలు పాల్గొని కవితల రూపం లోనూ, కథల రూపం లోనూ, ప్రసంగాల రూపం లోనూ తమ ప్రతిభని వెలిబుచ్చారు.  ఈ సదస్సు తో అమెరికా-కెనడా రచయితల మధ్య పరిచయాలు, సత్సంబంధాలు పెరిగి, ఉత్తర అమెరికా తెలుగు సాహిత్యం మరింత  ప్రతిష్టమయింది. ఈ విషయమై మొదటి సారి సదస్సులో పాల్గొన్న అనేకమంది కెనడా రచయితలు తమ హర్షం వ్యక్తపరిచారు. 

* సరిహద్దు గీతని చెరిపేస్తూ కెనడా అమెరికా రచయితలందరూ సంబరం గా జరుపుకున్న ఇటువంటి పండుగలు తరచూ జరగాలని, మునుముందు కూడా రెండు దేశాలూ కలిసి సదస్సులు నిర్వహించాలనీ అనేకమంది మిత్రులు, శ్రేయోభిలాషులూ ఆశాభావం వ్యక్తం చేసారు. 

* ఈ సదస్సుని 12 వేదికలుగా విభజించగా ప్రతి వేదిక నిర్వహకులూ, సాంకేతిక నిపుణులూ,  తమ వేదిక మీద ప్రసంగించాల్సిన అనేక మంది రచయితలతో కలిసి సమావేశాలు నిర్వహించి, సందేహ నివృత్తి చేసి, జూం నిర్వహణలో అంతరాయం కలగకుండా, సభని అతి సమర్థవంతంగా నిర్వహించారు. సభని అందంగా తీర్చిదిద్దడం లో జూం హోస్ట్ ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచారు. 

* సదస్సుల విషయంలో అనుభవం లేని మమ్మల్ని వేలు పట్టుకుని నడిపిస్తూ, ఎంతో ఓర్పుతో  ప్రతి విషయాన్నీ వివరిస్తూ, అతి క్లిష్టమైన విషయాలని సులభంగా పరిష్కరిస్తూ,  సహనానికి మారుపేరేమో అనిపించిన గురుతుల్యులు శ్రీ వంగూరి చిట్టెన్రాజు గారికి కెనడా తెలుగువారి తరఫున అనేక ధన్యవాదాలు. 

* లక్ష్మీ రాయవరపు, తెలుగుతల్లి కెనడా వెబ్ మాసపత్రిక సంపాదకురాలు  కృషి, అకుంఠిత దీక్ష, మొక్కవోని సంకల్పం  ఈ సదస్సు కి చాలా శోభమానమైంది.

* కెనడా మినిష్టరు ప్రసాద్ పండా గారు, తనికెళ్ళ  భరణి గారు, సుద్దాల అశోక్ తేజ గారు, వడ్డేపల్లి కృష్ణ గారు, డేనియల్ నాజర్ గారు, భువనచంద్ర గారు, బలభద్రపాత్రుని రమణి గారు, మహెజబీన్ గారు సదస్సుకి హజరై తమ ప్రసంగాలతో ప్రేక్షకులనలరించారు.

* వంగూరి ఫౌండేషన్, తెలుగుతల్లి కెనడా వెబ్ మాస పత్రిక ముఖ్య నిర్వాహకులుగా, టొరాంటో తెలుగు టైంస్, ఓంటారియో తెలుగు ఫౌండేషన్, తెలుగు వాహిని, ఆటవా తెలుగు అసోసియేషన్, కాల్గేరీ తెలంగాణా అసోసియేషన్, తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరాంటో కలిసి ఈ సదస్సుని విజయవంతం గా నిర్వహించాయి. 

 

Tags :