వంట పాత్రలతో క్యాన్సర్ ముప్పు!

వంట పాత్రలతో క్యాన్సర్ ముప్పు!

మన ఇంట్లో వంట చేసుకునేందుకు వాడుకునే పాత్రలు, గిన్నెలతో క్యాన్సర్‌ ముప్పు ఉందని తాజా అధ్యయనంలో తేలింది. ఫర్‌ ఎవర్‌ కెమికల్స్‌ అని పిలిచే సింథటిక్‌ కెమికల్స్‌ సాధారణంగా ఆహార పదార్థాల ప్యాకేజింగ్‌ లేదా కొన్ని రకాల వంటపాత్రల్లో ఉంటాయి. పర్‌ ఫ్లోరో ఆక్టేన్‌ సల్ఫేట్‌ (పీఎఫ్‌ఏఎస్‌) అనే కెమికల్స్‌ నాన్‌ స్టిక్‌ వంట పాత్రలు, నల్లాలు, సముద్రపు ఆహారం, వాటర్‌ ప్రూఫ్‌ బట్టలు, శుభప్రరిచే ఉత్పత్తులు, ఆఖరికి షాంపూలలో కూడా ఉంటాయి. ఈ కెమికల్స్‌ వల్ల లివర్‌ క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం ఉన్నదని సదరన్‌ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. ఈ కెమికల్స్‌కు తక్కువగా ప్రభావితమైన వారితో పోల్చుకుంటే ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ అయిన వారు 4.5 రెట్లు ఎక్కువగా క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం ఉన్నదని గుర్తించారు.

 

Tags :