క్యాట్స్ దసరా-దీపావళి వేడుకలు

క్యాట్స్ దసరా-దీపావళి వేడుకలు

రాజధాని ప్రాంతీయ తెలుగుసంఘం (క్యాట్స్‌) ఆధ్వర్యంలో దసరా-దీపావళి వేడుకలను అక్టోబర్‌ 30వ తేదీన ఘనంగా నిర్వహించారు. అధ్యక్షురాలు సుధారాణి కొండపు తొలుత అందరికీ దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. జనరల్‌ సెక్రటరీ దుర్గాప్రసాద్‌ గంగిశెట్టి స్వాగతం పలికారు. క్యాట్స్‌ కార్యవర్గం, మదన్మోహన్‌ దంపతుల దీపప్రజ్వలన, అభిరామ్‌ వినాయక ప్రార్థనతో వేడుకలు ప్రారంభమయ్యాయి.

కల్చరల్‌ ఛైర్‌ హరీష్‌ కొండమడుగు, అడ్వైజర్లు గోపాల్‌, లక్ష్మిబాబు సమన్వయంలో కూచిపూడి డాన్స్‌ అకాడమీ పుత్తడిబొమ్మ పూర్ణమ్మ నృత్య నాటిక, ఇంద్రాక్షి, శ్రేషల తెలుగు పద్యపఠనం, సాయికాంత శిష్యుల కాళియమర్ధనం, శ్రావణి డాన్స్‌ స్కూల్‌ దసరా థీమ్‌, ముద్ర ఆర్ట్స్‌ కూచిపూడి, నాట్యమార్గం భరతనాట్యం, లలితారాంపల్లి, మధురం స్కూల్‌ మధుర సంగీతం, హరి వేణుగానం, శ్రవణ్‌ శిష్యబృంద వాయిద్య నైపుణ్యం, డిసి మెట్రో దేశీటాలెంట్‌ సంగీత విభావరి, చైతన్య పోలోజు సాంప్రదాయ ఫ్యాషన్‌ షో, స్వర, సుప్రజల టాలివుడ్‌ నాట్యాలు, వందేమాతరం డాన్స్‌ అలరించాయి.

లౌడన్‌ కౌంటీ చైర్‌ ఫిలిస్‌ రండలి, వర్జీనియా సెనెటర్‌ జెన్నిఫర్‌ బాయ్‌స్కో, డెలిగేట్స్‌ సుహాస్‌ సుబ్రహ్మణ్యం, వెండీ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. వేణు నక్షత్రం ‘‘అరుగు’’ పుస్తకాన్ని ఈ సందర్భంగా  ఆవిష్కరిచారు. ఉపాధ్యక్షులు సతీష్‌ వడ్డి, శ్రీధర్‌ నాగిరెడ్డి, మంగ అనంతాత్ముల, శ్రీలేఖ పల్లె, శ్రీనివాస్‌ అనుగు, భాస్కర్‌ గంటి, అటార్ని సంతోష్‌ సోమిరెడ్డి, శ్రవణ్‌ పాడూరు, రియాలిటి శ్రీధర్‌, నవీన్‌ రంగా, గౌడ్‌ రాంపురం, జ్యోతి పిసుపాటి, శైలజ తదితరులు పాల్గొన్నారు. సుధ కొండపు మాట్లాడుతూ జులై1-3 తేదీలలో జరిగే ఆటా సభలకు క్యాట్స్‌ కో-హోస్ట్‌ గా వ్యవహరించడం గర్వంగా ఉందన్నారు. ఈ వేడుకలను విజయవంతం చేసిన కార్యవర్గ సభ్యులకు ఇతరులకు సుధ కొండపు ధన్యవాదాలు తెలిపారు.

Click here for Photogallery

https://www.youtube.com/playlist?list=PLj0Z22gL8vBO4uj8ksB0ZWnBaj4QMnbFQ

 

Tags :