ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కెప్టెన్ అమరీందర సింగ్ ?

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కెప్టెన్ అమరీందర సింగ్ ?

భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై ఎన్డీయే దృష్టి పెట్టింది. ఈ రేసులో పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పేరు తాజాగా వినిపిస్తోంది. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా అమరీందర్‌కు నిలబెట్టే అవకాశముందని మాజీ సీఎం కార్యాలయం వెల్లడించింది.  అమరీందర్‌ సింగ్‌ తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తోన్న నేపథ్యంలో ఆయన కార్యాలయం నుంచి  ఈ ప్రకటన రావడం గమనార్హం. ప్రస్తుతం అమరీందర్‌ సింగ్‌ వెన్నెముక శస్త్రచికిత్స కోసం లండన్‌ వెళ్లాను. గత వారం ఆపరేషన్‌ పూర్తయిన అనంతరం ప్రధాని మోదీ కెప్టెన్‌తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నట్లు సమాచారం. లండన్‌ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కెప్టెన్‌ తన పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ (పీఎల్‌సీ) పార్టీని బీజేపీలో విలీనం చేయనన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే మోదీతో అమరీందర్‌ మంతనాలు జరిపినట్లు  సమాచారం. విలీనం అనంతరం కెప్టెన్‌ ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.

 

Tags :