క్యాట్స్ వనభోజనాలకు మంచి స్పందన

క్యాట్స్ వనభోజనాలకు మంచి స్పందన

క్యాపిటల్‌ ఏరియా తెలుగు సంఘం (క్యాట్స్‌) ఆధ్వర్యంలో జూన్‌ 5న మేరీల్యాండ్‌ రాష్ట్రం, డమాస్కస్‌ నగరంలోని రీజినల్‌ పార్క్‌ లో ఏర్పాటు చేసిన వనభోజనాల కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. డిఎంవి ఏరియా లో ఉన్న ప్రవాస భారతీయులు అందరూ కలిసి వనభోజనాలలో పాల్గొన్నారు. కోవిడ్‌ అనంతరం నిర్వహించిన ఈ మొట్ట మొదటి వనభోజనాలలో సుమారు 1000 మందికి పైగా పాల్గొని చాలా రోజుల తర్వాత ఔట్డోర్‌ ఈవెంట్‌ లో మ్యూజిక్‌ తో ఆహ్లదకరమైన వాతావరణం లో సందడి చేశారు. వివిధ రకాల పసందైన వంటకాలతో పాటు తేనేటి విందులను అతిధులకు వడ్డించారు. రాఫెల్స్‌ తీసి గెలిచిన విజేతలకు జూలై లో జరగబోయే ఆటా కన్వెన్షన్‌ టికెట్స్‌ ని అందజేశారు. వాలీ బాల్‌, త్రో బాల్‌, బింగో వంటి సరదా గేములు నిర్వహించారు. మహిళల కోసం మెహందీలను ఏర్పాటు చేశారు. పిల్లల కోసం ఏర్పాటుచేసిన మ్యాజిక్‌ షోలు ఆకట్టుకున్నాయి. క్యాట్స్‌ ప్రెసిడెంట్‌ సతీష్‌ వడ్డీ మాట్లాడుతూ, ఈ  కార్యక్రమాన్ని ఇంతగా విజయవంతం చేసిన ప్రతి ఒక్క క్యాట్స్‌ వాలంటీర్స్‌ కీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసారు.  ఇంత మంచి స్పందన రావడం తో ఫ్యూచర్‌ లో చాలా ఈవెంట్స్‌ మేరీల్యాండ్‌ లో చేయబోతున్నట్లు చెప్పారు. త్వరలో జరుగునున్న ఆటా కన్వెన్షన్‌కుి అందరూ తప్పకుండా రావాలని కోరుతూ మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన దీపికా భుజాల గారికి, సుధీర్‌ బండారుకు మరియు రవి చల్లాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కాట్స్‌ వ్యవస్థాపకుడు రామ్మోహన్‌ కొండా మాట్లాడుతూ ఈ పిక్నిక్‌ ఈవెంట్‌లో చాలా మంది కొత్త వ్యక్తులను కలుసుకున్నాం. ఇలా అందరినీ ఒకే దగ్గర కలవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. మన డిఎంవి ఏరియా లో తెలుగు వాళ్లకు క్యాట్స్‌ ఎప్పుడు అండదండగా ఉంటుందని, ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములుగా చేరి మా కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని కోరారు. ఇంత పెద్ద ఎత్తున సాగిన ఈ కాట్స్‌ పిక్నిక్‌కు సహాయ సహకారాలు అందించిన టీం మొత్తానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన కార్యదర్శి పార్థ బైరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమ నిర్వహణకు తమ వంతు సహకారాన్ని అందించిన కాట్స్‌ కార్యవర్గా నికి, ట్రస్టీలు రామ్మోహన్‌ి, భాస్కర్‌, అనిల్‌ి, రవి, ప్రవీణ్‌, గోపాల్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే మా ఈ ఈవెంట్‌ కోసం మాతో పాటుగా కృషి చేసిన మా కాట్స్‌ కార్యవర్గం రజని, కోట్ల, పవన్‌, రవి బారెడ్డి, లోహిత్‌, మహేష్‌, రంగ, శివ, శ్రీనివాస్‌, కృష్ణ కిషోర్‌, రాంపురం గౌడ్‌, నివాస్‌, సాయి అరిగేలా, అరుణ, లావణ్య మరియు సంకీర్త లకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

 

Tags :