ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు

ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు

వైఎస్‌ వివేకానంద రెడ్డి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. మరోవైపు సీబీఐ బృందం పులివెందుకు చేరుకుంది. కడపకు చేరుకున్న బృందం పులివెందులకు వచ్చి ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించింది. అదే విధంగా ఓఎస్‌డీ కార్యాలయ పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించింది. క్యాంపు కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఎంపీ అవినాస్‌ రెడ్డి తండ్రి భాస్కర రెడ్డి ఇంటిని పరీశిలించారు. అదే విధంగా సీఎం  క్యాంపు కార్యాలయం పరిసర ప్రాంతాలను గంటపాటు అధికారులు పరిశీలించారు. అవినాశ్‌ రెడ్డి ఇంటి  వద్ద ఉన్న వారి నుంచి ఎంపీ తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి ఇంట్లో ఉన్నారా అని ఆరీ తీశారు. లేరనే సమాధానం రావడంతో వెనుదిరిగారు.  భాస్కర రెడ్డి కోసం ఆచూకీ తీసిన అధికారులు ఇక పులివెందుల నుంచి కడపకు చేరుకున్నారు. 

తాజాగా అవినాష్‌ రెడ్డికి నోటీసులు జారీ చేయడం సంచలనం రేపుతోంది. నేడు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైఎస్‌ వివేకా కేసులో ఎంపీ అవినాష్‌ను సీబీఐ ప్రశ్నించనుంది. అధికార వైసీపీకి చెందిన ఎంపీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోదరుడు అవినాష్‌ రెడ్డిని సీబీఐ విచారణకు పిలువడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.  అవినాష్‌ రెడ్డి స్పందించారు.  కేసు దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తానన్నారు. ఒకరోజు ముందుగా నోటీసు పంపడం వల్ల తాను ముందుగా అనేక కార్యక్రమాలకు  హాజరుకావాల్సి ఉందని, అందువల్ల ఐదు రోజులు గడువు ఇస్తే ఎప్పుడు పిలిచినా హాజరవుతానని సీబీఐకి తెలియజేశారు.

 

 

Tags :