ఈ నెల 24న కేంద్ర కేబినెట్ భేటీ?

ఈ నెల 24న కేంద్ర కేబినెట్ భేటీ?

వ్యవసాయ చట్టాల రద్దు సంబంధిత బిల్లులకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని తెలిపాయి. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ ఈ చట్టాలను రద్దు చేస్తామని, సంబంధిత చట్టపరమైన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలలో బిల్లులను ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్దమైంది. దీనికి ముందు కేబినెట్‌ ఆమోద ముద్ర పడాల్సి ఉంటుంది. ఈ నెల 29 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావవేశాలు ఆరంభం కానున్నాయి. గత ఏడాది నవంబర్‌ నుంచి రైతులు ఈ వివాదాస్పదమైన మూడు చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ శివార్లలో తిష్టవేసుకుని ఉద్యమిస్తున్నారు. ఈ పట్టుదలకు ఫలితంగా ప్రధాని వీటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది.

 

Tags :