చంద్రబాబు నాయుడుకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం

చంద్రబాబు నాయుడుకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ఢిల్లీ లో జరిగే ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జాతీయ కమిటీ సమావేశంలో పాల్గొనాల్సిందిగా చంద్రబాబును కోరాంది. దీంతో ఈ నెల 6న ఆయన ఢిల్లీ కి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్‌ సెంటర్‌లో ఈ సమావేశం జరగనుంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఉత్సవాల నిర్వహణకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా నిర్వహించే  సన్నాహక సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు.

 

Tags :