స్పుత్నిక్ లైట్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతి

స్పుత్నిక్ లైట్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతి

దేశీయంగా ఉత్పతి చేసిన 40 లక్షల స్పుత్నిక్‌ లైట్‌ టీకా డోసులను రష్యాకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. భారత్‌లో వాటి అత్యవసర వినియోగానికి ఇంకా ఆమోదం లభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. రష్యాకు చెందిన స్పుత్నిక్‌ లైట్‌  అదే దేశం అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ వంటిదే. సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌గా దాన్ని వినియోగిస్తున్నారు. భారతీయ ఔషధ తయారీ సంస్థ హెటెరో బయోఫార్మా లిమిటెడ్‌ దేశీయంగా ఈ టీకాను ఉత్పత్తి చేస్తోంది.

 

Tags :