కేంద్రం కీలక నిర్ణయం ... జూన్ 1 నుంచి

భారత్ లోని కొన్ని కంపెనీలు తయారు చేసి దగ్గు మందుల కారణంగా కొన్ని దేశాల్లో మరణాలు సంభవించడం ఇటీవల తీవ్ర ఆందోళనలకు దారితీసింది. ఆ సిరప్‌లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇటీవల హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలోనే దగ్గు మందు ఎగుమతులపై కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దగ్గు సిరప్‌లకు ప్రభుత్వ ల్యాబ్ లలో అనుమతి తప్పనిసరి చేసింది. ఆ తర్వాతే ఎగుమతులు చేసుకోవాలని స్పష్టం చేసింది. జూన్ 1 నుంచి ఈ నూతన నిబంధనలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.
Tags :