కేంద్రం యూటర్న్.. యధావిధిగానే నీట్

కేంద్రం యూటర్న్.. యధావిధిగానే నీట్

ఈ ఏడాది నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్షను పాత విధానంలోనే నిర్వహిస్తామనీ, వచ్చే విద్యా సంవత్సరంలో మార్పులు ఉంటాయని కేంద్రం ప్రకటించింది. నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్షల్లో చివరి నిమిషంలో మార్పులు చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేయడంతో కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోక తప్పలేదు. సవరించిన సిలబస్‌, కొత్త విధానాన్ని 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని మోడీ సర్కార్‌ వెల్లడిరచింది. నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్ష 2021కు నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత పరీక్ష సిలబస్‌ను మార్చుతున్నట్టు కేంద్రం అర్ధాంతరంగా ప్రకటించింది. ఈ నిర్ణయంపై అభ్యంతరం తెలుపుతూ 41 మంది పోస్ట్‌  గ్రాడ్యుయేట్‌ డాక్టర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేసింది. చివరి నిమిషంలో మార్పులు సరైంది కాదనీ, మార్పుల అమలును వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని కేంద్రం, జాతీయ పరీక్ష బోర్డులను సూచించింది. సముచిత పరిష్కారంతో కోర్టు ముందుకు రావాలని ఆదేశించింది.

 

Tags :