తెలంగాణకు కేంద్రం మరో మెగా ప్రాజెక్టు

తెలంగాణకు కేంద్రం మరోమెగా ప్రాజెక్టును ప్రకటించింది. రైతులకు, చేనేత కార్మికులకు ఉపయోగపడుతూ యువతకు ఉద్యోగాలను అందించే మెగా టెక్స్‌టైల్ పార్కును తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆత్మనిర్బర్ భారత్ కార్యక్రమంలో భాగంగా టెక్స్‌టైల్స్ రంగంలో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్స్ రీజియన్ అండ్ అపారెల్ పార్క్ (పీఎం`మిత్ర) పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఫార్మ్ టు పైబర్ టు, ఫైబర్ టు ఫ్యాక్టరీ బీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ బీ, ఫ్యాషన్ టు పారిన్ అనే 5ఎఫ్ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించిన ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్‌టైల్స్ పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందులో భాగంగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఈ 7 మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రకటించారు.