విదేశాలకు వెళ్లేవారి కోసం ... ప్రికాషన్ డోసు

ప్రస్తుతం కోవిడ్ బూస్టర్ డోసును 9 నెలల గ్యాప్‌తో ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే విదేశాలకు వెళ్లేవారి కోసం ప్రభుత్వం రూల్స్‌ను సరళీకరించింది. 9 నెలల వ్యవధి కన్నా ముందే ప్రికాషన్ డోసును తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తెలిపారు. మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్లో కూలో ఈ విషయాన్ని పోస్టు చేశారు. విదేశాలకు వెళ్లనున్న భారతీయ పౌరులు, విద్యార్థులు, తాము వెళ్తున్న దేశానికి చెందిన మార్గదర్శకాల ప్రకారం టీకాలు తీసుకుని వెళ్లవచ్చు అని తెలిపారు. విదేశీ విద్యార్థులు కోవిడ్ టీకా కోసం కోవిన్ పోర్టల్‌లో చూసుకోవాలన్నారు. 18 ఏళ్లు దాటిన వారు, రెండవ డోసు తీసుకుని 9 నెలలు దాటితే, వాళ్లంతా ప్రికాషన్ డోసు తీసుకోవచ్చు. రెండవ డోసు, బూస్టర్ డోసు మధ్య 9 నెలల గ్యాప్ ఉండాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ పేర్కొన్న విషయం తెలిసిందే.