ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త

ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అదనపు రుణాలు పొందేందుకు కేంద్ర ఆర్థికశాఖ పచ్చజెండా ఊపింది. రూ.2,665 కోట్ల సమీకరణకు అనుమతి ఇచ్చింది. మూలధన వ్యయం కోసం లక్ష్యాన్ని చేరుకున్న 11 రాష్ట్రాలకు అనుమతి ఇవ్వగా అందులో ఏపీ  కూడా ఉంది. దీంతో రాష్ట్రానికి 2021-22 త్రైమాసిక-1లో అదనపు రుణాలు పొందేందుకు అనుమతి వచ్చినట్లు అయింది. దీంతో మార్కెట్‌ నుంచి అదనంగా ఏపీ రూ.15,721 కోట్ల సమీకరణ చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్నందుకు కేంద్రం ప్రోత్సాహకం ఇచ్చింది. ఇందులో భాగంగానే 11 రాష్ట్రాలకు అదనపు రుణ సమీకరణకు అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, హరియాణ, కేరళ, మధ్యప్రదేశ్‌, మణిపూర్‌, మేఘాలయ, నాగాలాండ్‌, రాజస్థాన్‌, ఉత్తరఖండ్‌ ఈ 11 రాష్ట్రాలకు రూ.15,721 కోట్ల రుణాలు పొందేందుకు కేంద్ర ఆర్థిక శాఖ విభాగం అనుమతి ఇచ్చింది.

 

Tags :