శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారికి చాగంటి దంపతుల పాదపూజ

శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారికి చాగంటి దంపతుల పాదపూజ

ఏకాదశీ ప్రయుక్త శ్రావణ సోమవారము పర్వదినును పురస్కరించుకొని, ఈరోజు కంచి కామకోటి పీఠాధీశ్వరులు, జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు పరివార సమేతముగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి గృహమునకు విచ్చేసారు. శ్రీ స్వామి వారి తో పాటు వివిధ ప్రదేశముల నుండి వేద శాస్త్ర సదస్సుకు విచ్చేసిన సుమారు 50 మంది ఘనాపాఠీలు కూడా శ్రీ చాగంటి వారి గృహమును విచ్చేసి, వారి సత్కారమును స్వీకరించారు.

శిష్యులందరితో కలిసి సపరివారంగా శ్రీ స్వామి వారు గోశాల నుండి శ్రీ చాగంటి వారి ఇంటికి పాదచారియై రాగా, చాగంటి వారు కుటుంబ సమేతముగా శ్రీ స్వామి వారిని మార్గం మధ్యంలోనే కలుసుకొని, నమస్కరించారు. శ్రీ స్వామి వారికి చాగంటి వారు తమ ఇంటి వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా, శ్రీ స్వామి వారు శ్రీ చాగంటి వారి దంపతులచే పాదపూజను స్వీకరించారు. ప్రత్యేకమైన కదంబ పుష్పములు మాలతోను, పుష్ప కిరీటముతోను చాగంటి వారి దంపతులు శ్రీ స్వామి వారిని పూజించారు. చాగంటి వారి యొక్క పూజా సింహాసనమునకు శ్రీ స్వామి వారు హారతి ఇచ్చి, శ్రీ చాగంటి వారి దంపతులను ఆశీర్వదించారు.

తదనంతరం గొప్ప వేద శాస్త్ర పండితులైన అనేక మంది ఘనాపాఠీలతో ఈరోజు వేద శాస్త్ర సదస్సు శ్రీ చాగంటి వారి ఇంటిలోనే జరిగినది. వారు చాగంటి వారి ఇంట సుస్వరముగా ఘన పారాయణ చేయగా, శ్రీ చాగంటి వారు పండితులనందరినీ ఘనంగా సత్కరించారు.

 

Click here for Photogallery

 

 

Tags :