వారిపై కేసులు పెట్టాలనుకుంటే.. 5 కోట్లమంది పైనా

వారిపై కేసులు పెట్టాలనుకుంటే.. 5 కోట్లమంది పైనా

పాలనను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టాలనుకుంటే రాష్ట్రంలోని 5 కోట్ల మంది పైనా పెట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు పరధిలోని వేపనపల్లి విద్యాదీవెన పై ఎమ్మెల్యేను ప్రశ్నించిన ఇంజినీరింగ్‌ విద్యార్థి జశ్వంత్‌పై కేసు పెట్టి అరెస్ట్‌ చేయడం ప్రభుత్వ అసహనానికి ప్రత్యక్ష సాక్ష్యమని ఆక్షేపించారు. సంక్షేమ పథకాల్లో కోతలు, అభివృద్ధి పనులపై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలతో వైసీపీ ప్రభుత్వం అసహనానికి లోనవుతోందని చెప్పారు.  విదార్థులపైనా కేసులు పెట్టి వారి జీవితాలను నాశనం చేస్తారా? అని అగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ పాలనపై గడపగడపలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. కాలర్‌ ఎగరేసుకుని తిరుగుదామనుకున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలను, కాలర్‌ పట్టుకుని జన్నం ప్రశ్నిస్తున్నారని తెలిపారు. వేపనపల్లిలో జరిగిన ఘటనపై వైసీపీ క్షమాపణలు చెప్పాలన్నారు. జశ్వంత్‌తో పాటు అతడికి మద్దతుగా నిలిచిన గ్రామస్థులు టీడీపీ నేతలపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. స్థానిక పోలీసులు అత్యుత్సాహంపై డీజీపీ చర్యలు తీసుకోవాలన్నారు.

 

Tags :