ఇది ప్రభుత్వ వైఫల్యమే.. వారికి రూ.25 లక్షలు ఇవ్వాలి : చంద్రబాబు

ఇది ప్రభుత్వ వైఫల్యమే.. వారికి రూ.25 లక్షలు ఇవ్వాలి : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భారీ వర్షాలకు కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్ట్‌ తెగిపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.  భారీ వర్షాలకు నష్టపోయిన వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.  వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ తరపున రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించారు. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు రూ.1000 ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ  భారీ వర్షాల నేపథ్యంలో ముందుస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజల ప్రాణాలను బలి చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌రెడ్డి ఆకాశంలో విహరిస్తే వరద బాధితుల కష్టాలెలా తెలుస్తాయని ప్రశ్నించారు. వరదల్లో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.25 లక్షలివ్వాలని డిమాండ్‌ చేశారు.

 

Tags :