శ్మశాన స్థలంలో వైసీపీ పిశాచాలు.. ఘాటుగా స్పందించిన చంద్రబాబు

శ్మశాన స్థలంలో వైసీపీ పిశాచాలు.. ఘాటుగా స్పందించిన చంద్రబాబు

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో శ్మశాన స్థలం కబ్జాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. శ్మశాన స్థలంలో వైసీపీ పిశాచాలు పడ్డాయంటూ ఎద్దేవా చేశారు. అయితే జిల్లాలోని శ్మశాన స్థలాన్ని వైసీపీ నేతలు కబ్జా చేశారంటూ ఓ వార్త పత్రికలో కథనం వచ్చింది. ఇందులో 100కిపైగా శవాలను పూడ్చిన శ్మశానాన్ని ఇప్పుడు వైసీపీ నేతలు దుక్కి దున్ని పంట సాగు చేస్తున్నారని కథనం పేర్కొంది. దీనిపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. వ్యవస్థలు సమాధి అయితే ఇలాంటి ఫలితాలే వస్తాయన్నారు. శ్మశానాన్ని కబ్జా చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులైన తమ పై అధికారుల ఒత్తిళ్లకు భయపడకుండా కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.