అది వైసీపీ పాలనకు... టీడీపీ పనికి ఉన్న తేడా? : చంద్రబాబు

అది వైసీపీ పాలనకు... టీడీపీ పనికి ఉన్న తేడా? : చంద్రబాబు

విశాఖపట్నంపై పెత్తనం విజయసాయిరెడ్డిదా? సుబ్బారెడ్డిదా? అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. చోడవరంలో టీడీపీ మినీ మహానాడు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మహానాడుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆటంకం కలిగించిందని మండిపడ్డారు. టీడీపీ సభలను అడ్డుకునేందుకు జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అయినా మహానాడును సక్సెస్‌ చేశారు. టీడీపీ నేతలపై ఆక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఈ ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. ఇలాంటి వాటికి టీడీపీ కార్యకర్తలు బెదిరే పరిస్థితి లేదన్నారు. వైసీపీని ఇంటికి పంపించే సత్తా ఉతారాంధ్రకు ఉందని తెలిపారు. కోనసీమ రైతులు క్రాప్‌ హాలిడే దిశగా వెళ్తున్నారు. సీఎం సొంత జిల్లా కడపలోనూ రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటించారు.  దీన్ని బట్టి వైసీపీ పాలన ఎలా ఉందో అర్థమవుతుంది అని అన్నారు. అమ్మఒడి ఏమైందని ప్రశ్నించారు. టీచర్ల వ్యవస్థను సర్వ నాశనం చేశారని విమర్శించారు.

ఈ ప్రభుత్వం ఉన్నంతవరకూ ఎవరూ పెట్టుబడులు పెట్టరు. యువతకు ఉద్యోగాలు రావు. పెట్టుబడులు వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. మనం ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశాం. ఐటీ రంగంలో యువతకు చాలా ఉద్యోగాలు వచ్చాయి. జగన్‌ ప్రభుత్వంలో వాలంటీర్‌ ఉద్యోగాలు వచ్చాయి. 5 వేల రూపాయలకు ఎవరైనా ఉద్యోగం చేస్తారా? అని ప్రశ్శించారు. జగన్‌ పదే పదే ఉద్యోగాలిచ్చామని చెబుతున్నారు. టీడీపీ హయాంలో ఒక్క గుంతైనా చూశారా? అది వైసీపీ పాలనకు టీడీపీ పనికి ఉన్న తేడా? అని చంద్రబాబు తెలిపారు.

 

Tags :