ప్రశిస్తున్న వారిని భయపెట్టేందుకే వైసీపీ హత్యాకాండ

ప్రశిస్తున్న వారిని భయపెట్టేందుకే వైసీపీ హత్యాకాండ

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో టీడీపీ గ్రామ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్యను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. హత్య ఘటనపై స్పందిస్తూ.. జగన్‌ రెడ్డి దారుణ పాలనపై తిరుగబడుతున్న టీడీపీ క్యాడర్‌ను, ప్రజలను భయపెట్టేందుకే వైసీపీ హత్యకాండ సాగిస్తుందని దుయ్యబట్టారు. పల్నాడులోనే ఇప్పటికే పదుల సంఖ్యలో రాజకీయ హత్యలు జరిగాయన్నారు. ప్రశ్నిస్తున్న వారిని భయపెట్టేందుకే వైసీపీ హత్యాకాండకు పాల్పడుతోందని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల టైంలో బోండా ఉమా, బుద్ధా వెంకన్నలపై  దాడి చేశారని అన్నారు. గత దాడుల సమయంలోనే చర్యలు తీసుకుంటే అడ్డుకట్ట పడేదని తెలిపారు. దాడులు చేస్తే పదవులు కట్టబెట్టే విష సంస్కృతిని జగన్‌ చాటుకున్నారని విమర్శించారు. చంద్రయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

 

Tags :