ప్రధాని మోదీ సమావేశం... చంద్రబాబు నాయుడికి ఆహ్వానం

ప్రధాని మోదీ సమావేశం... చంద్రబాబు నాయుడికి ఆహ్వానం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిసెంబర్‌ 5న ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఫోన్‌ చేసి ఈ సమావేశానికి ఆహ్వానించారు. భారత్‌లో నిర్వహించే జీ`20 భాగస్వామ్యదేశాల సదస్సుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీని ద్వారా రాజకీయ పార్టీల సూచనలు, అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం తెలుసుకోనుంది. రాష్ట్రప్రతి భవన్‌లో డిసెంబర్‌ 5న సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. జీ`20 దేశాల కూటమికి భారత్‌ అధ్యక్షతవహిస్తున్న విషయం తెలిసిందే.

 

Tags :
ii). Please add in the header part of the home page.