ఇది కక్షపూరితం...చంద్రబాబు

ఇది కక్షపూరితం...చంద్రబాబు

నారాయణ విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌ పూర్తిగా కక్షపూరితమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పరీక్షల నిర్వహణలో విఫలమై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వైకాపా ప్రభుత్వం.. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఆయన్ను అరెస్ట్‌ చేసిందన్నారు. ఈ మేరకు చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. నారాయణ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాస్‌ కాపీయింగ్‌, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు నారాయణను ఎలా బాధ్యుడిని చేస్తారని చంద్రబాబు నిలదీశారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా.. విచారణ చేపట్టకుండా, ఆధారాలు లేకుండా నేరుగా ఆయన్ను అరెస్ట్‌ చేయడం కక్ష పూరిత చర్య కాదా? అని మండిపడ్డారు.

 

Tags :