ఎవరెన్ని కుట్రలు పన్నినా నన్నేమి చేయలేరు

ఎవరెన్ని కుట్రలు పన్నినా నన్నేమి చేయలేరు

ఎవరెన్ని కుట్రలు పన్నినా నన్నేమి చేయలేరు అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు కర్నూలులో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ పాలనలో వేధింపులు, అప్పులు విపరీతంగా పెరిగాయని అన్నారు. నిత్యావసరాల ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని దెబ్బతీయాలని ఎన్నో కుట్రలు చేశారని, తప్పుడు కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారించాలన్నారు. ఒంగోలు మహానాడు ద్వారా చర్చించుకుందామన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. మేం కన్నెర్ర చేస్తే జగన్‌ తట్టుకోలేరు. బీసీ జనార్ధన్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు. అవినీతి కేసులున్న వ్యక్తి మాపై కేసులు పెడతారా? పైశాచిక ఆనందం పొందుతున్న వ్యక్తికి గుణపాఠం చెబుతాం. రాష్ట్రంలో ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. కర్నూలుకు హైకోర్టు ఎందుకు తరలించలేదు. ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేదు. పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు అని ప్రశ్నించారు.

 

Tags :