శశ్మానం అని... ఇప్పుడు రూ.10 కోట్లకు ఎలా? : చంద్రబాబు

శశ్మానం అని... ఇప్పుడు రూ.10 కోట్లకు ఎలా? : చంద్రబాబు

ఆత్మకూరు ఉపఎన్నికలో ప్రధాన ప్రతిక్షం టీడీపీ  పోటీలో లేకపోయినా వైసీపీకి ఓట్లు పెరగలేదని, దీనికి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే ప్రధాన కారణం అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ  రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటు పెట్టని సీఎం జగన్‌కు ఆ ప్రాంత భూములు విక్రయించే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. అమరావతిని శ్మశానమని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏకరా రూ.10 కోట్లకు ఎలా అమ్మకానికి పెడుతుందని నిలదీశారు. ప్రభుత్వం కోసం నిర్మించిన భవనాలను మూడేళ్లుగా పూర్తి చేయకుండా ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇచ్చే యత్నాన్ని చంద్రబాబు తప్పుబట్టారు.

గత ఎన్నికలతో ఉప ఎన్నికను పోల్చి చూస్తే వైసీపీకి కనీసం 10 వేల ఓట్లు కూడా అదనంగా పడలేదన్నారు. పన్నులతో వాతలు, పథకాలకు కోతలు అనేలా జగన్‌ పాలన సాగుతోంది. ప్రజలకు అందే పథకాల్లో రకరకాల నిబంధనల పేరుతో కోతలు పెట్టి డబ్బులు మిగుల్చుకుంటున్నారు. చెత్త దగ్గర నుంచి మొదలు అన్నింటిపైనా పనులు వేసి వాతలు పెడుతున్నారు. పలు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు కొత్త కొత్త నిబంధనలతో కోతలు వేస్తోంది. ఒంటరి మహిళల  పింఛన్‌ వయసు నిబంధనను 50 ఏళ్లకు పెంచి లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో తగ్గిచడం అమానయం అని మండిపడ్డారు.

 

Tags :