పోలీసులే దౌర్జన్యానికి దిగితే సామాన్యుడికి దిక్కెవరు? : చంద్రబాబు

పోలీసులే దౌర్జన్యానికి దిగితే సామాన్యుడికి దిక్కెవరు? : చంద్రబాబు

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో పోలీసులే దౌర్జన్యానికి దిగితే సామాన్యుడికి దిక్కెవరు? అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. కడప జిల్లా దువ్వూరుకు చెందిన ఓ మైనార్టీ కుటుంబం తమ భూమిని వైకాపా నేతలు ఆక్రమించారని సెల్ఫీ వీడియో తీసుకొని, ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. వైకాపా ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాక రోజుకో దుర్మార్గపు వార్త వినాల్సి వస్తోందని చంద్రబాబు ఆరోపించారు. జగన్‍ బంధువు తిరుపాల్‍ రెడ్డి అక్బర్‍ బాషా భూమి కబ్జా చేసినట్లు తెలిసిందన్నారు. కొంతమంది పోలీసులు విధులు పక్కనబెడుతున్నారు. సివిల్‍ పంచాయతీల్లో పోలీసులు తలదూర్చడం మాములైందన్నారు. ఎన్‍కౌంటర్‍ చేస్తానని బాధితుడిని బెదిరించడం దారుణం అన్నారు.

గతంలో నంద్యాలలో సలీం కుటుంం ఆత్మహత్య చేసుకుంది. అక్బర్‍ కుటుంబం కూడా తమకు అదే మార్గంలో దిక్కంటోంది. అక్బర్‍ కుటుంబాన్నికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. అక్బర్‍ బాషా దైర్యంగా ఉండండి. ప్రభుత్వం వెంటనే అక్బర్‍ భాషా కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. బాద్యులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‍ చేశారు.

 

Tags :