న్యాయం జరగడం లేదనే ఎన్నికలు బహిష్కరించాం : చంద్రబాబు

న్యాయం జరగడం లేదనే ఎన్నికలు బహిష్కరించాం : చంద్రబాబు

ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరామర్శిచారు. హైదరాబాద్‌ అంబర్‌పేటలోని మందకృష్ణ నివాసానికి వెళ్లి చంద్రబాబు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు న్యాయం జరగడం లేదనే ఎన్నికలు బహిష్కరించామని తెలిపారు. సంక్షేమ పథకాల వల్లే గెలిచామని వైసీపీ భావించడం అవివేకం అన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. నేరాలు చేయడం  ముఖ్యమంత్రి జగన్‌కు అలవాటైందన్నారు. దాడులు చేసిన దాఖలాలు మా పార్టీ చరిత్రలో లేవు అని అన్నారు. 

 

Tags :