ఈ పోరాటం నా కోసం కాదు: చంద్రబాబు

ఈ పోరాటం నా కోసం కాదు: చంద్రబాబు

ఈ పోరాటం నా కోసం కాదు, బలహీన వర్గాల బాగు కోసం అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కడపలో పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసిందని, ఇక ఎవరూ ఆపలేరని అన్నారు. బాదుడే బాదుడుతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై మోయలేని భారాన్ని మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మహానాడుకు ఒంగోలు స్టేడియం ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కడపలో అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా? అధిక అప్పులతో జగన్‌ రాష్ట్ర పరువును తీశారన్నారు. సీఎం జగన్‌ చెప్పిన రాయలసీమ ఎత్తిపోతల ఏమైంది? గుంటూరు మహిళ వెంకాయమ్య ఉన్నదే చెప్పింది. నిజాలు చెబితే వెంకాయమ్య ఇంటిపై దాడి చేశారు. సీబీఐ కేసుల్లో వాదించిన వారికి, తనతో కేసుల్లో ఉన్నవారికి జగన్‌ రాజ్యసభ అభ్యర్థిత్వం ఇచ్చారన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ సీట్లు ఇచ్చేందుకు ఆయనకు సమర్థులు కనిపించలేదా? పులివెందులలో బస్టాండ్‌ కట్టలేని వారు 3 రాజధానులు కడతారా? పులివెందులలో రైతులకు ఎందుకు బీమా రావడం లేదో సీఎం చెప్పాలన్నారు. సమస్యలు చెప్పే వారిపై కేసులు పెడుతున్నారు. వైసీపీ పాలనలో పేదల జీవితాలు చితికిపోయాయి. జగన్‌ చేసేది ఉత్తుత్తి బటన్‌ నొక్కుళ్లే. కడప నుంచే టీడీపీ జైత్రయాత్ర మొదలవుతుంది అని తెలిపారు.

 

Tags :