సంక్షోభాలు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు...

సంక్షోభాలు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు...

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మూడేళ్ల వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాం. సంక్షోభాలు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదన్నారు. కొత్తగా రాష్ట్ర యువతకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో ప్రజలు ఒకసారి పరిశీలించాలన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆశ ప్రజలందరిలో ఉందన్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో  పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో పరిశ్రమలు ముందుకొచ్చాయి. రాష్ట్రంలో పరిశ్రమలతో అనేక మందికి ఉపాధి కల్పించామన్నారు. వైసీపీ పాలనలో పరిశ్రమల్లేవు. యువతకు ఉద్యోగాలు లేవు. వైసీపీ నేతల రౌడీయిజం చూసి రాష్ట్రానికి   వచ్చిన పరిశ్రమలు కూడా వెళ్లిపోయాయి. కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా రాలేదు అని అన్నారు.

 

Tags :