పోలవరం ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా : చంద్రబాబు

పోలవరం ప్రాంతాన్ని  ప్రత్యేక జిల్లాగా : చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టు కోసం ముంపు మండలాల ప్రజలంతా తమ జీవితాలను త్యాగం చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చాక ముంపు మండలాలన్నీ కలిపి పోలవరం జిల్లా చేస్తామని ప్రకటించారు. పోలవరం ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించడం ద్వారా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోకపోతే ఇక నాయకులెందుకని సీఎం జగన్‌ను ఉద్దేశించి అన్నారు. వైసీపీ ఫ్యాన్‌ ఆపితే తప్ప ప్రజల కష్టాలు తీరవన్నారు.

దొంగల చేతికి తాళాలిచ్చారు. వాళ్లు రాష్ట్రాన్ని దోచుకుని ప్రజలకు నామాలు పెడుతున్నారు. డ్రామాలు ఆడే వాళ్లని నమ్మకూడదు. సొంత బాబాయ్‌ని చంపి నాపై పెట్టారు. రేపు ఎవరినైనా చంపి నాపై పెడతారు. నీతి, నిజాయితీ, సమాజంపై ప్రేమ లేని వ్యక్తులు వాళ్లు. పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదని పార్లమెంట్‌లో కేంద్రం చెప్పిందన్నారు. 25 మంది ఎంపీలను గెలిపించండి కేంద్రం మొడలు వంచుతా అన్నారు. ఇప్పుడేం జరిగింది? కేంద్రం ముందు మెడలు దించారు అని సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

 

Tags :