ఇప్పుడు కూడా వినకపోతే... ఈ రాష్ట్రానికి ఇదే ఆఖరి అవకాశం

ఇప్పుడు కూడా వినకపోతే... ఈ రాష్ట్రానికి ఇదే ఆఖరి అవకాశం

వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణను ఆయన కుమార్తె వైఎస్‌ సునీత తెలంగాణ హైకోర్టు బదిలీ చేయించడం సీఎం జగన్‌కు చెంపదెబ్బ లాంటిదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని విజయరాయిలో ఇదేం ఖర్మ మన రాష్ట్రాన్ని కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్‌ వివేకాను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనే విషయాలు వెలుగులోకి రావాలన్నారు. ఈ అంశంపై సీఎం జగన్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.  ఇలాంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేందుకు అర్హత ఉందా అని నిలదీశారు. ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే  అమరావతి రాజధానిగా ఉండదని, పోలవరం ముంచేస్తారని ఆనాడు ప్రజలకు వివరించా. ముద్దులు పెడుతున్నాడని మోసపోవద్దని గెలిచిన తర్వాత పిడిగుద్దులుంటాయని స్పష్టంగా చెప్పా. ఆనాడు నేను చెప్పిందే ఇవాళ జరుగుతోంది.  రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు. అందుకే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని కార్యక్రమాన్ని తీసుకొచ్చాను అన్నారు. ప్రజలు ఇప్పుడైనా నా మాట వింటారని, ఇప్పుడు కూడా వినకపోతే ఈ రాష్ట్రానికి ఇదే ఆఖరి అవకాశం అవుతుంది  అన్నారు. నాకు కాదు నాకేం కొత్త చరిత్ర అవసరం లేదు. ఉమ్మడి ఏపీలో సీఎంగా చేశాను. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నాకు ఎమ్మెల్యే పదవితో పనిలేదు. ఈ రాష్ర ప్రజల్లో చైతన్యం రావాలి. దైర్యంగా ముందుకు రావాలి. భయపడితే ఆ భయమే మన్ని చంపేస్తుంది అన్నారు.

 

 

Tags :