పాఠశాల వరకు వచ్చేసిందంటే.. పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో

పాఠశాల వరకు వచ్చేసిందంటే.. పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో

పాఠశాల విద్యార్థుల వరకు గంజాయి వచ్చేసిందంటే బాధగా ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 13 ఏళ్ల వయసున్న బాలికలు విజయవాడలో గంజాయి తాగడం నివ్వెరపరిచిందన్నారు. ఈ వార్త నన్ను ఎంతో ఆందోళనకు, ఆవేదనకు గురి చేసింది. పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. గంజాయి సరఫరాను అరికట్టేలా రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాజకీయ వేధింపులకు పోలీసులను వాడడం ఈ ప్రభుత్వానికి అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను పట్టించుకోకుండా గాలికొదిలేయడం  క్షమించరాని నేరమని ఆక్షేపించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.