ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు .. ఎవరూ ముందుకు రావడం లేదు

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు .. ఎవరూ ముందుకు రావడం లేదు

వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ ఒక్కరు ముందుకు రావడం లేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు.  కుప్పంలో రోడ్‌ షో నిర్వహిచారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని దీనిన్ని అభివృద్ధి చేస్తామన్నారు. టీడీపీ హయంలో విద్యార్థులు చదువుకోవడానికి కళాశాలలు తీసుకొచ్చామన్నారు. వైసీపీ పాలనలో చదువుకున్న విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిరదని ఆవేదన వ్యక్తం చేశారు. 

కుప్పంపై ముఖ్యమంత్రి జన్‌ కక్ష కట్టారని విమర్శించారు. నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతులను పట్టించుకునేవారు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.  నారాయణ, చైతన్య విద్యా సంస్థల నుంచి మంచి చదువు అందుతోంది. అలాంటి విద్యాసంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. నారాయణ విద్యా సంస్థల బాధ్యతల నుంచి నారాయణ తప్పుకున్నారు. కేవలం రాజకీయ కక్షతోనే నారాయణను అరెస్టు చేశారు. 43 ఏళ్లు కష్టపడి విద్యాసంస్థలను నారాయణ నిర్మించారు అని చంద్రబాబు పేర్కొన్నారు.

 

Tags :