ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై గవర్నర్‌కు చంద్రబాబు ఫిర్యాదు

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై గవర్నర్‌కు చంద్రబాబు ఫిర్యాదు

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఇదే విషయంపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. గురువారం నాడు రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయిన చంద్రబాబు.. విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై ఫిర్యాదు చేశారు. కాగా, వైద్యారోగ్య శాఖకు వైఎస్ఆర్ ఎంతో సేవ చేశారని, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపిన సీఎం జగన్.. ఈ కారణంగానే హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తున్నట్లు అసెంబ్లీలో చెప్పారు. ఈ సందర్భంగా సభలో నిరసన వ్యక్తం చేస్తూ పోడియం వైపు దూసుకెళ్లిన టీడీపీ నేతలను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

 

Tags :