వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన ఖరారు

వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన ఖరారు

రాయలసీమ జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించడంతో ఆ ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. ఈ నెల 23 నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే వరద బాధితులను ఆదుకునేందుకు టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్‌ ట్రస్టు బృందాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు పార్టీ సీనియర్‌ నేతలతో జిల్లాలవారీగా పర్యటించాలని సూచిస్తూ కమిటీలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నియించారు. మరోవైపు వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నెల 23న ఉదయం కడప జిల్లాలో, మధ్యాహ్నం నుంచి తిరుపతి లో పర్యటించనున్నారు. 24న నెల్లూరు జిల్లాలో పర్యటించి, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను పరామర్శించారు.

 

Tags :