ఖమ్మం జిల్లాకు చంద్రబాబు రాక

ఖమ్మం జిల్లాకు చంద్రబాబు రాక

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 24న ఖమ్మం జిల్లా పర్యటనకు రానున్నారు. చింతకాని మండలం పాతర్లపాడులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. అధినేత రాక సందర్భంగా పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఐదేళ్ల క్రితం పాతర్లపాడులో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గ్రామస్థులు ఈ  విగ్రహాన్ని చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరించాలని నిర్ణయించారు. ఇందుకు చంద్రబాబు అంగీకరించినా వివిధ కారణాలతో పలు మార్లు వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 24న తాను పాతర్లపాడు వస్తానని చంద్రబాబు సమాచారం ఇచ్చారు.

 

Tags :