వైసీపీ ఏకపక్ష నిర్ణయాలతోనే నష్టం : చంద్రబాబు

వైసీపీ ఏకపక్ష నిర్ణయాలతోనే నష్టం : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షేకావత్‌కు చంద్రబాబు లేఖ రాశారు. వైసీపీ ఏకపక్ష నిర్ణయాలతోనే ప్రాజెక్టుకు సాంకేతికంగా నష్టం జరిగిందన్నారు.  పోలవరం నిర్మాణం సత్వర పూర్తికి సహకరించాలని కోరారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో పనులు మరో ఏజెన్సీకి అప్పగించారని విమర్శించారు. ఆకస్మికంగా పనుల నిలిపివేతతో కొత్త ఏజెన్సీ పనులను ప్రారంభించేందుకు 6 నెలల సమయం పట్టిందన్నారు. పనులు చేపట్టక పోవడంతో డయాఫ్రం వాల్‌ దెబ్బదిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు విషయంలో వెంటనే స్పందించి పోలవరం సత్వర పూర్తికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరారు.

 

Tags :