మీరు మారకపోతే.. మార్చాల్సి ఉంటుంది : మోదీ వార్నింగ్

మీరు  మారకపోతే.. మార్చాల్సి ఉంటుంది : మోదీ వార్నింగ్

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఎన్‌డీఏకి చెమటలు పట్టిస్తున్నాయి. పలు అంశాలపై విపక్షాలు అధికార పార్టీని టార్గెట్‌ చేసి, గుక్క తిప్పుకోనివ్వడం లేదు. ఇలాంటి సందర్భంలో పలువురు బీజేపీ ఎంపీలు, మినిస్టర్లు సమావేశాలకు హాజరు కాకపోవడంపౖౖె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన మోదీ ఎంపీలకు గట్టి వార్నింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. ఎంపీలు ఇకనైనా తమ ప్రవర్తన మార్చుకోవాలని, లేదంటే మార్పుaలు తప్పవని మోదీ హెచ్చరించినట్లు సమాచారం.

పార్లమెంట్‌ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవ్వండి. చిన్న పిల్లలకు చెప్పినట్లు ప్రతిసారీ దీని గురించి నేను ఎంపీలకు చెప్పడం బాలేదు. కనీసం పిల్లలు కూడా ఒక విషయాన్ని పదేపదే చెప్పించుకోవాలనుకోరు. ఇకనైనా మారండి.  మీరు మారకపోతే మార్పులు చేయాల్సి వస్తుంది అని మోదీ హెచ్చరించారు.  సమయానుగుణ మార్పులు జరుగుతాయని బీజేపీ ఎంపీలకు మోదీ వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎంపీల గైర్హాజరుపై మోదీ గతంలోనూ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఎంపీలు క్రమశిక్షణ పాటించాలని అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని గతంలో కూడా సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో  మంత్రులు అమిత్‌ షా, పీయూష్‌ గోయల్‌, విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌, పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి పాల్గొన్నారు.

 

Tags :