చార్‌ధామ్‌ యాత్రకు మార్గదర్శకాలు విడుదల

చార్‌ధామ్‌  యాత్రకు మార్గదర్శకాలు విడుదల

ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం చార్‌ధామ్‌ యాత్రకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్‌తో పాటు ఈ`పాస్‌ తప్పనిసరి చేసింది. అలాగే రెండు మోతాదుల కొవిడ్‌ టీకా లేదంటే, కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా చూపాలని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల  చేసింది. కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ ప్రయాణానికి 72 గంటల కంటే ఎక్కువ సమయం మించకూడదని పేర్కొంది. ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్‌ హైకోర్టు యాత్రలో రోజువారీగా పాల్గొనే భక్తుల సంఖ్యపై ఉన్న పరిమితిని తొలగించింది. దీంతో ఇకపై యాత్రలో పాల్గొనేందుకు భక్తుల సంఖ్యపై ఎలాంటి పరిమితి ఉండదు.

 

Tags :