చార్లొట్ తానా టీమ్ ఆధ్వర్యంలో వనభోజనాలు

చార్లొట్ తానా టీమ్ ఆధ్వర్యంలో వనభోజనాలు

చార్లొట్ తానా టీమ్ ఆధ్వర్యంలో చార్లొట్ లో గ్రీన్ మానర్ లో ఆంధ్రా సంప్రదాయ వంటకాలతో తానా వనభోజనాలు నిర్వహించారు. ఆంధ్ర వంటకాలు అరిసెలు, బూరెలు, పూర్ణాలు, ఉలవచారు వంటి వివిధ రకాలైన వంటకాలను అతిధులకు వడ్డించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 300 మంది విచ్చేశారు. పిల్లలకు రాపెల్ బింగో వంటి గేములు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు. కార్యక్రమానికి వచ్చిన తెలుగు వారు అందరూ కలిసి ఒక రోజంతా ఆహ్లాదంగా గడిపారు.

Click here for Event Gallery

 

Tags :